Breaking News

కొలంబోలో థియేటర్లు ఓపెన్​

కొలంబో: కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. సినిమా థియేటర్లు కూడా మూతపడటంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో అన్ని దేశాలు క్రమంగా లాక్​డౌన్​ను ఎత్తివేస్తున్నాయి. అయినప్పటికీ చాలా దేశాల్లో సినిమాహాళ్లు, పబ్లిక్​ పార్కులు, పబ్​లు వంటివి తెరవలేదు. కాగా తాజాగా శ్రీలంకలో సినిమా థియేటర్లను తిరిగి ఓపెన్​ చేయనున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ఇందుకు ప్ర‌తి థియేట‌ర్ నిర్వాహ‌కులు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులకు ఒప్పంద పత్రాన్ని అంద‌జేయాల్సి ఉంటుంది.
అలాగే దేశంలో అన్ని మ్యూజియాల‌ను, స్మార‌క చిహ్నాలు, సాంస్కృతిక క‌ట్ట‌డాల సంద‌ర్శ‌న‌ను జూలై 1 నుంచి తెర‌వ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్నది. అయితే ఇవ‌న్నీ సంద‌ర్శ‌కుల సంఖ్య‌పై ప‌రిమితులు వంటి ఆరోగ్య‌శాఖ జారీ చేసిన కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. విదేశీ పర్యాటకుల కోసం ఆగస్టు 1నుంచి విమాన స‌ర్వీసుల‌ను ప్రాంభిస్తున్నట్లు శ్రీలంక ప్ర‌భుత్వం తెలిపింది. శ్రీలంక‌‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,000 వేల క‌రోనా కేసులు వెలుగు చూశాయి. వీరిలో 1,200 మందికి పైగా కోలుకుని డిశ్చార్జి అవ్వ‌గా, 11 మంది మృత్యువాత ‌ప‌డ్డారు.