Breaking News

కొత్తగా 730 కరోనా కేసులు



సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 730 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,802కు చేరింది. ఆదివారం 225 మంది డిశ్చార్జ్​ అయ్యారు. యాక్టివ్​ కేసులు 3,861 ఉన్నాయి. మొత్తం 3,731 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 659 కరోనా పాజిటివ్​ కేసులు కేవలం జీహెచ్​ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. జనగామ జిల్లాలో 34 కేసులు, రంగారెడ్డి జిల్లా 10, మేడ్చల్​ జిల్లాలో 9 చొప్పును కేసులు నమోదయ్యాయి.