సారథి న్యూస్, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ఓ యువ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. మంగళవారం వైద్యాధికారులు గ్రామానికి వచ్చి ఆయనతో కాంటాక్ట్ అయిన వారి వివరాలు ఆరాతీశారు. సదరు డాక్టర్ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కరోనా రోగులకు వైద్యచికిత్సలు అందించే వైద్యుల బృందంలో గత మూడు నెలలుగా ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోగులకు ట్రీట్మెంట్ అందించే క్రమంలో కరోనా మహమ్మారి ఆయనకు కూడా అంటుకోవడం పట్ల కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
అయితే సదరు యువ డాక్టర్‌కు వైద్యం పరంగా మంచిపేరుంది. ప్రమాదాలు, అత్యవసర ఆపరేషన్లు, ఇతర ఆపద సమయాల్లో ట్రీట్మెంట్ కోసం గాంధీ ఆస్పత్రికి ఎవరిని తీసుకెళ్లినా దగ్గరుండి మరీ వైద్యచికిత్సలు చేయించేవారని గ్రామస్తులు చెబుతున్నారు. భగవంతుడి దయతో త్వరగా కోలుకోవాలని స్థానికులు కోరుతున్నారు.