బాలీవుడ్లో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చాలా సంచలనాన్నే క్రియేట్ చేసింది. సినీవర్గాల్లో తీవ్ర చర్చాంశనీయాంశం కూడా అయింది. ఎంతో ప్రతిభ ఉన్నా సుశాంత్‌కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆ కారణంగా సుశాంత్ డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కొందరు బాలీవుడ్ ప్రముఖుల వల్లే సుశాంత్‌కు ఈ స్థితి వచ్చిందని దుయ్యబడుతున్నారు. అయితే ఆ ప్రముఖుల్లో కరణ్ జోహార్ ఒకరు. సుశాంత్ విషయంలో ప్రస్తుతం కరణ్ విపరీతమైన ట్రోల్స్‌కు గురవుతున్నారు. ఆయన తన సినిమాలను కేవలం ప్రముఖ సినీవారసులతో మాత్రమే తీస్తాడని.. పేరూ ఊరూ లేనివాళ్లతో అసలు మాట్లాడడని వారసులను స్టార్స్‌గా మార్చడం ఆయనకే సాధ్యం అన్న వార్తలు టాలీవుడ్లో బాగా వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ కు చెందిన ఎంతో మంది కూడా కరణ్ జోహార్ బ్యానర్ ద్వారా వచ్చిన వారే. కరణ్ జోహార్ చాలా కాలంగానే ఈ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సుశాంత్ మరణం తర్వాత ఆ విమర్శలు ఎక్కువయ్యాయి. అందుకే కరణ్ జోహార్ కొన్నాళ్ల పాటు తన బ్యానర్ లో స్టార్ వారసుల సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే కొన్ని సినిమాలు ప్లాన్ చేసినా కూడా వాటిని క్యాన్సిల్ చేసుకునే ఉద్దేశ్యంలో ఉన్నాడట. మొత్తానికి సుశాంత్ మరణంతో కరణ్ జోహార్ నిర్మించే సినిమాల్లో మార్పులు రాబోతున్నాయి అంటున్నారు.