సారథి న్యూస్, ఢిల్లీ : కేంద్రంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి రాజేష్ భూషణ్‌ను కేంద్ర ఆరోగ్య,కుటుంబసంక్షేమ శాఖ కొత్త కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్థుతం ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రీతి సుడాన్ జులై 31వతేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో 1987 బ్యాచ్ బీహార్ క్యాడర్ అధికారి అయిన రాజేష్ భూషణ్ ను కొత్త కార్యదర్శిగా కేంద్రం నియమించింది. ప్రీతి సుడాన్ పదవీకాలం ఏప్రిల్ తో ముగిసినా కరోనా వల్ల ఆమె పదవీకాలాన్ని మూడు నెలలు పొడిగించింది. కేంద్ర గనులశాఖ కార్యదర్శి సుశీల్ కుమార్ ను జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా కేంద్రం బదిలీ చేసింది. త్రిపుర కేడరుకు చెందిన 1987 బ్యాచ్ ఐఎఎస్ అధికారి కుమార్ ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు.
- July 25, 2020
- Archive
- జాతీయం
- HEALTH
- PREETHI SUDAN
- RAJESH BHUSHAN
- ఆరోగ్యశాఖ
- ప్రీతి సుడాన్
- రాజేష్ భూషణ్
- Comments Off on కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త కార్యదర్శిగా రాజేష్ భూషణ్