Breaking News

కీలక పదవికి కరణ్​ జోహార్​ రాజీనామా

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య.. బాలీవుడ్​లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. సుశాంత్​ ఆత్మహత్యతో అతడి అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు సైతం బాలీవుడ్​లో ఉన్న బంధుప్రీతిపై ఓ రేంజ్​లో విరుచుకుపడ్డారు. బాలీవుడ్​లో తీవ్రమైన బంధుప్రీతి ఉందంటూ ట్రోలింగ్​ మొదలుపెట్టారు. కొందరు సినీ ప్రముఖులను సోషల్​మీడియాలో అన్​ఫాలో చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు కరణ్​జోహార్​ తీవ్ర మనస్థాపంతో ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ పదవి నుంచి తప్పుకొన్నారు. సుశాంత్ మరణం తర్వాత తనపై భారీగా ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. సుశాంత్ మరణం తర్వాత ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, ఆలియాభట్ ఇంటర్వ్యూలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. తన కార్యక్రమంలో సుశాంత్‌ను కించపరిచే విధంగా ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్​ అయ్యాయి. దీంతో అతడి అభిమానులు భారీ సంఖ్యలో కరణ్ అకౌంట్ నుంచి అన్‌ఫాలో అయ్యారు. మనస్థాపం చెందిన కరణ్​ కొంతకాలంగా మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నేమామి ఫిల్మ్ ఫెస్టివల్ బోర్డు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకొన్న కరణ్ జోహర్ తన రాజీనామా లేఖను సంస్థ డైరెక్టర్ స్మృతి కిరణ్‌కు పంపినట్టు తెలిసింది