Breaking News

కిన్నెరసానికి భారీ వరద

సారథిన్యూస్​, పాల్వంచ: కిన్నెరసాని రిజర్వాయర్​లోకి భారీగా వరదనీరు వస్తున్నదని కేటీపీఎస్​ 5,6 దశల సీఈ రవీంద్రకుమార్​ తెలిపారు. మంగళవారం రాత్రి గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గేట్లు తెరిచిన సమయంలో కిన్నెరసాని వాగులో ఎలాంటి రాకపోకలు చేయవద్దని హెచ్చరించారు. కిన్నెరసాని రిజర్వాయర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.495 టీఎంసీల నీరు ఉన్నది. 10 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతున్నది.