Breaking News

కార్మికుల సంక్షేమనిధికి రూ.450 కోట్లు జమచేయాలి

కార్మికుల సంక్షేమనిధికి రూ.450 కోట్లు జమచేయాలి

సారథి న్యూస్, కర్నూలు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ఆపాలని ప్రయత్నిస్తే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని భవన నిర్మాణ కార్మిక సంఘం న్యూ సిటీ కార్యదర్శి కె.సుధాకరప్ప ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ముజఫర్ నగర్ మట్టి పని అడ్డాలో జీవోనం.17 కాపీలను మాజీ కార్పొరేటర్ బి.సోమన్న మహిళా సంఘం నాయకురాలు ఎస్.ఓబులమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కె.సుధాకరప్ప, బి.సోమన్న మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమ నిధికి రూ.450 కోట్లు జమచేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 28న కలెక్టరేట్​ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ ఆనంద్, ఎస్​బషీర్ అహమ్మద్, మాదన్న, గోకారి, నాగరాజు, ఎల్లప్ప మహిళలు ఎస్.శారదమ్మ, లక్ష్మమ్మ, ఈశ్వరమ్మ, మంగమ్మ, శాంతమ్మ, ప్రభావతమ్మ పాల్గొన్నారు.