సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా మండలం వెదిర సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నందేల్లి ప్రభాకర్ రావు(46) భార్యతో కలిసి బైక్ పై కొండగట్టు నుంచి కరీంనగర్ వైపునకు వెళ్తుండగా, కరీంనగర్ నుంచి ఎదురుగా జగిత్యాల వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రభాకర్‌రావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతని భార్య తీవ్రంగా గాయపడింది. మృతుడి తమ్ముడు శ్రీనివాస్ రావు ఫిర్యాదు మేరకు ఎస్సై అనూష కేసుదర్యాప్తు చేస్తున్నారు.
- May 19, 2020
- క్రైమ్
- ACCIDENT
- KARIMNAGAR
- కారు ప్రమాదం
- కొండగట్టు
- జగిత్యాల
- Comments Off on కారు ఢీకొని ఒకరి మృతి