సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కోవిడ్ క్వారంటైన్ వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సింగరేణి ఎండీకి లేఖ పంపినట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి, మధు తెలిపారు. సింగరేణిలో కాంట్రాక్ట్, పర్మినెంట్ కార్మికులందరినీ కరోనా మహమ్మారి వెంటాడుతున్నదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పర్మినెంట్ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.
- July 30, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CITU
- EMPLOYEES
- GODHAVARIKHANI
- SINGARENI
- కోవిడ్
- సీఐటీయూ
- Comments Off on కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకోండి