సారథి న్యూస్, కొత్తగూడెం: సింగరేణిలోని కొందరు ఉన్నతాధికారులు కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని శుక్రవారం హౌస్ కీపింగ్ కాంట్రాక్టు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం సింగరేణి జనరల్ మేనేజర్ (సెంట్రల్ వర్క్ షాప్) గణపతిరావుకు వినతి పత్రం అందజేశారు. 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కొంతమంది ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా విధులనుంచి పంపించి వేస్తున్నారని కార్మికసంఘం నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు యర్రగాని కృష్ణయ్య, సూర్య, సరోజ, రమా, రహీమ్, ప్రేమ్ భాయ్, సుగుణ, కనక లక్ష్మి, కరీం, శ్రీను, నాగరాజు, లింగమ్మ, ముంతాజు తదితరులు పాల్గొన్నారు.
- June 19, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- LABOUR
- PROGRAM
- SINGARENI
- STRIKE
- ఉన్నతాధికారులు
- సీఐటీయూ
- Comments Off on కాంట్రాక్ట్ కార్మికులపై వివక్ష తగదు