సారథిన్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వేలూరు గ్రామంలో నర్సింహులు అనే దళిత రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నర్సింహులు చెందిన 13 గుంటల భూమిని ఇటీవల స్వాధీనం చేసుకున్నదని.. అందుకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వేలూరు బయలుదేరిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్‌ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ నేతలపై ప్రభుత్వం దమనకాండను కొనసాగిస్తున్నదని వారు ఆరోపించారు.
- July 30, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- ARREST
- CONGRESS
- SIDDIPET
- VELURU
- సంపత్
- సిద్దిపేట
- Comments Off on కాంగ్రెస్ నేత సంపత్ అరెస్ట్