Breaking News

కల్నల్ సంతోష్ బాబు త్యాగం వెలకట్టలేనిది


సారథి న్యూస్​, హైదరాబాద్​: ఇండియా– చైనా సరిహద్దులో చోటుచేసుకున్న ఘర్షణలో మంగళవారం సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతిపై సీఎం కేసీఆర్​ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడం నుంచి అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీశ్​ రెడ్డిని ఆయన ఆదేశించారు.