సారథి న్యూస్, సూర్యాపేట: దేశం కోసం కల్నల్ సంతోష్‌బాబు చేసిన ప్రాణ త్యాగానికి యావత్ భారతావని సెల్యూట్ చేస్తోందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో అమర జవాన్ సంతోష్ బాబు తల్లిదండ్రులు, ఇతర సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గంటకుపైగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఆర్మీ అధికారులు కోరుతున్నారని, కానీ సూర్యాపేటలో సంతోష్ అంత్యక్రియలు జరిపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారని తెలిపారు. సంతోష్ భౌతిక కాయాన్ని త్వరగా రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
- June 17, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- JAGADEESH REDDY
- SANTHOSH
- SURYAPET
- కల్నల్
- సంతోష్
- Comments Off on కల్నల్ సంతోష్ త్యాగం చిరస్మరణీయం