సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నగరంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నీటి సమస్య తలెత్తకుండా రెండవ సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించాలని కోరినట్లు వివరించారు. రోడ్ల విస్తరణ చేయాలని సీఎంను కోరారని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో శానిటేషన్ మరింత మెరుగుపరిచే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. పాత నగరంలో కాల్వలను విస్తరించాలని, నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందని సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి వివరించినట్లు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తెలిపారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని సీఎం హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
- September 8, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- CM YS JAGANMOHAN REDDY
- Kurnool
- MLA HAFIZKHAN
- ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
- కర్నూలు
- ఫ్లైఓవర్
- సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి
- Comments Off on కర్నూలు అభివృద్ధిపై ఫోకస్