Breaking News

కరోనా లక్షణాలు ఉంటే చెప్పండి


సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా ప్రబలకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ సూచించారు. శుక్రవారం ఆయన పోలీసు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు తెలియజేయాలని సూచించారు. అన్ని పోలీస్​స్టేషన్లలో థర్మల్​ స్ర్కీనింగ్​ పరీక్షలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టులు నమోదు చేయాలని ఆదేశించారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్​ హరిలాల్ కుటుంబానికి పోలీసు సంక్షేమ నిధి ద్వారా రూ.లక్ష నగదును చెక్కును అందజేశారు. అడిషనల్ ఎస్పీ రమణారెడ్డి, వినీత్ కుమార్ ఏసీబీ ఇన్​స్పెక్టర్లు శ్రీనివాసరావు, రవి, డీసీఆర్బీ ఇన్​ స్పెక్టర్​ గురుస్వామి, ఐటీ సెల్ ఇన్​స్పెక్టర్​ అబ్బయ్య పాల్గొన్నారు.