Breaking News

కరోనా రోగులకు మంచి ట్రీట్​మెంట్​

కరోనా రోగులకు మంచి వైద్యం

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కరోనా నివారణ చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్యాశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని), ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం రోగులు, వైద్యసిబ్బందితో వీడియోకాన్ఫరెన్స్​ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలకు ప్రతినెలా రూ.350 కోట్లు, ఒక్కో కరోనా పేషెంట్​భోజనానికి ఒకరోజుకు రూ.500 చొప్పున రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేస్తోందని వైద్యాశాఖ మంత్రి ఆళ్ల నాని వివరించారు. పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా 104 కాల్ సెంటర్ సర్వీసులు, 108 అంబులెన్స్ వాహనాల కొరత రాకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, డాక్టర్​సుధాకర్, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్​కె.ఫక్కీరప్ప, కర్నూలు మున్సిపల్​కార్పొరేషన్​కమిషనర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు.