సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న పకడ్బందీ చర్యల ఫలితంగా రాష్టంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని సీఎం రాజకీయ కార్యదర్శి, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు.
మంగళవారం మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలం కూచన్పల్లిలో సొంతంగా తయారుచేయించిన మాస్క్ లు, శానిటైజర్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ ను పూర్తిగా నివారించే వరకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని అన్నారు.
అందరూ ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరంగా బయటకు రావాల్సి వస్తే సోషల్ డిస్టెన్స్ పాటించి మాస్క్ లు ధరించాలన్నారు. ప్రభుత్వ చర్యలతో కొత్త కేసుల నమోదు బాగా తగ్గిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్ దేవాగౌడ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటేశ్వర్లు, డీఎల్పీవో జ్యోతి రెడ్డి, ఎంపీడీవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.