Breaking News

కరోనా టెస్టులు పెంచాలి

సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా వైరస్ ను అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ హుస్నాబాద్​ మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. సోమవారం అక్కన్నపేట హెల్త్​సెంటర్​ ఎదుట ఆందోళన చేపట్టారు. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు, పోలీసులు అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్నవారికి కోవిడ్-19 టెస్టులు చేయాలన్నారు. అనంతరం అక్కన్నపేట వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. బిజెపి నాయకులు సంపత్ కుమార్, కార్తీక్, కృష్ణ, వంశీ, రాహుల్, కళ్యాణ్, సాయిరాం పాల్గొన్నారు.