సారథిన్యూస్, నల్లగొండ: కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సన్నిహితులు, స్నేహితులే కదా అని పార్టీలకు వెళితే కరోనా అంటించుకోవడం ఖాయమని పేర్కొన్నారు. విందు, వినోదాలతోనే కరోనా అధికంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. మన చుట్టే ఎంతోమంది కరోనా రోగులు ఉండొచ్చన్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. త్వరలో గ్రామీణప్రాంతాల్లోనూ టెస్టులు చేస్తామాని చెప్పారు. మంగళవారం ఆయన వర్తక, వాణిజ్య సంఘాలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు డాక్టర్ విద్యాసాగర్, లక్ష్మీ నారాయణ, దిలీప్ రెడ్డి, ఉప్పల ఆనంద్, మోరిశెట్టి యోగి తదితరులు పాల్గొన్నారు.
- July 28, 2020
- Archive
- నల్లగొండ
- లోకల్ న్యూస్
- CARONA
- JAGDISHREDDY
- MINISTER
- NALGONDA
- కరోనా
- జగదీశ్‌రెడ్డి
- Comments Off on కరోనా కాటేస్తుంది జాగ్రత్త