సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : కరోనా కట్టడిలో నాగర్ కర్నూల్ జిల్లాదే విజయమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రెడ్ జోన్ పరిధిని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్, ఎస్పీ డాక్టర్ వై సాయిశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుంచి రెడ్ జోన్ ను పోలీస్, మున్సిపల్ అధికారులు పకడ్బందీగా అమలుచేశారని, అధికారుల నిర్దిష్ట ప్రణాళిక ద్వారా జిల్లాలో కరోనా కట్టడి జరిగిందన్నారు. జిల్లాలో పాజిటివ్ వచ్చిన ఇద్దరికి కూడా నెగిటివ్ నిర్ధారణ తర్వాత గాంధీ ఆస్పత్రి నుంచి విడుదలై నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ లో ఉన్నారని వారికి ఈనెల 28న మరోమారు పరీక్షలు నిర్వహించి నెగిటివ్ నిర్ధారణ తర్వాత ఇంటికి పంపిస్తామని వెల్లడించారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారు తప్పనిసరిగా ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డీఎస్పీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
- April 24, 2020
- లోకల్ న్యూస్
- COLLECTOR
- Corona
- SP
- ఎస్పీ
- కరోనా కట్టడి
- కలెక్టర్
- పాజిటివ్
- Comments Off on కరోనా కట్టడిలో జిల్లాదే విజయం