లండన్: కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. వేలాది కేసులు నమోదవుతూ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గుడ్‌న్యూస్ అందిచనుందని తెలుస్తోంది. ఫేస్ – 1 ట్రయల్స్ ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది వాడటం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు లేవని, ఇది సురక్షితమైన వ్యాక్సిన్‌గా పరీక్షల్లో తేలిందని సమాచారం. దీనికి సంబంధించి వివరాలను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ త్వరలోనే తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌కు సంబంధించి మూడు ఫేజుల్లో ట్రైట్స్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వందల మంది కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వాటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ లైసెన్స్ పొందిన ఇండియన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలీదని, దీనికి సంబంధించి మనుషుల మీద చేసిన ట్రయల్స్ మంచి ఫలితాలను ఇచ్చిందని ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఒక సైంటిస్ట్ చెప్పారు.
- July 17, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- OXFORD UNIVERSITY
- ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
- కోవిడ్–19
- వ్యాక్సిన్
- Comments Off on కరోనా.. ఆక్స్‌ఫర్డ్ గుడ్‌న్యూస్