సారథిన్యూస్, మహబూబాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలను ఉచితంగా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. కరోనా టెస్టుల్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ఆయన మహబూబాబాద్‌లోని పెరుమాండ్ల భవన్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికి కరోనా టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.
- June 15, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- CARONA
- MAHABUBABAD
- TELANGANA
- TESTS
- WARANGAL
- పెరుమాండ్ల భవన్
- ప్రైవేట్ ఆస్పత్రులు
- Comments Off on కరోనాపై నిర్లక్ష్యం తగదు