సారథి న్యూస్, శ్రీకాకుళం : మానవ సమాజ రక్షణకు కలిసికట్టుగా కరోనా మహ్మారిని తరిమేద్దామని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. శనివారం ఆర్ బీ గెస్ట్ హస్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని కోరారు.
రాజకీయాలకు తావు లేకుండా విపత్తును ఎదుర్కోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు.