సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కలెక్టర్ శ్రీధర్ శనివారం వెల్లడించారు. అతను ఇంతకుముందు హైదరాబాద్ కాటేదాన్ ప్రాంతంలో కూలీ పనులు చేసుకునేవాడు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా సొంత గ్రామానికి వచ్చాడని, అతనికి డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నందున వారం రోజుల క్రితం చికిత్స కోసం హైదరాబాద్ చికిత్స కోసం వెళ్లాడని తెలిపారు. అతనికి సంబంధించిన ఇప్పటివరకు ఏడుగురు ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించామని వెల్లడించారు. ఇంకా ఎవరెవరు ఉన్నారనే వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
- June 6, 2020
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- COLLECTOR
- MARRIPALLY
- NAGARKURNOOL
- కరోనా
- గాంధీ ఆస్పత్రి
- ప్రైమరీ కాంటాక్ట్స్
- Comments Off on కరోనాతో మర్రిపల్లి వాసి మృతి