- డీజీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కరోనా తొలి మరణం నమోదైంది. పోలీసు కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. బుధవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు డీజీపీ మహేందర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ భరోసా ఇచ్చారు. మన్సూరాబాద్‌కు చెందిన దయాకర్ రెడ్డి జియగూడలో విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్ అంత్యక్రియలు ఐదుగురి సమక్షంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.