సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో శుక్రవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మీటింగ్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా వ్యాధి నివారణకు ఇక్కడి వైద్యారోగ్య కేంద్రంలో మంచి వైద్యసేవలు అందుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. చిన్నపిల్లల వైద్యుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్, స్థానిక డాక్టర్ రాజేష్ గౌడ్ ఆస్పత్రిలోని సమస్యలను నేరుగా చూపించారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న సమస్యల పరిష్కారానికి తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో హరినాథ్ గౌడ్, వైద్యులు డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ రాజేష్ గౌడ్, డాక్టర్ సుచరిత, సర్పంచ్లు వెంకటయ్య, ఎంపీటీసీ సభ్యురాలు దేవేంద్రమ్మ, మహిళా సమాఖ్య అధ్యక్షులు సునీతారెడ్డి, ఉప సర్పంచ్ గౌసియాబేగం పాల్గొన్నారు.
- September 18, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- BIJINEPALLY
- CARONA
- LATTUPALLY
- NAGARKURNOOL
- కరోనా
- నాగర్కర్నూల్
- బిజినేపల్లి
- లట్టుపల్లి
- Comments Off on కరోనాకు వైద్యసేవలు భేష్