సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ చికిత్స పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బులు లాగుతున్న ఓ ఆర్ఎంపీని పోలీసులు బుధవారం అరెస్ట్చేశారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామం కొయిటాలవీధికి చెందిన డి.రంగన్న స్థానికంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. కరోనా పేరుతో చికిత్స అందిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి విచారణ చేశారు. కోయిలకుంట్ల వీఆర్వో రవిప్రసాద్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సంబంధించి సదరు ఆర్ఎంపీపై క్రిమినల్కేసు పెట్టించి అరెస్ట్చేయించినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్జి.వీరపాండియన్వెల్లడించారు. జిల్లాలో ఎవరైనా కరోనా చికిత్స పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- August 19, 2020
- Archive
- క్రైమ్
- COVID19 TREATMENT
- KARONA
- Kurnool
- RMP
- UYYALAWADA
- ఆర్ఎంపీ
- కరోనా
- కర్నూలు
- Comments Off on కరోనాకు చికిత్స.. ఆర్ఎంపీ అరెస్ట్