సారథి న్యూస్, కర్నూలు: కరోనా విజృంభణ నేపథ్యంలో కర్నూలు నగరంలోని కంటైన్మెంట్జోన్లలో లాక్ డౌన్ పరిస్థితిని శనివారం కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప, నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ సమీక్షించారు. నగరంలోని రాజ్ విహార్ సర్కిల్ మీదుగా కొండారెడ్డి బురుజు, మాలగేరి, వడ్డేగేరి, పెద్దమార్కెట్, పూలబజార్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, గనిగల్లీ నగర్, ఉస్మానియా కాలేజీ మీదుగా తదితర ప్రాంతాల్లోని పలురోడ్లు, వీధుల్లోని కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ పరిస్థితిని కాన్వాయ్ లో కలియ తిరిగి వెళ్లి పరిశీలించారు.
- July 18, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- లోకల్ న్యూస్
- CARONA
- KARNOOL
- కరోనా
- కర్నూలు
- Comments Off on కంటైన్మెంట్ జోన్లపై నజర్