బాలీవుడ్ డ్రగ్మాఫియాపై సంచలన ఆరోపణలు చేసిన కంగనా రనౌత్‌కు ప్రాణహాని ఉందని ఆమెకు వెంటనే భద్రత కల్పించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని.. ఆ విషయం తాను నిరూపిస్తానని కంగనా ఇటీవల ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ అనంతరం ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బీజేపీ స్పందించింది. కంగన రనౌత్‌కు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే వెంటనే భద్రత కల్పించాలని.. బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియా ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టాలని బీజేపీ నేత రామ్ కదం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం ఉద్దవ్‌కు లేఖ రాశారు. డ్రగ్మాఫియాతో రాజకీయ నాయకులకు కూడా సంబంధం ఉండిఉండొచ్చని ఆరోపించారు. నటి రియాకు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించిందని, అలాగే కంగనాకు కూడా భద్రత కల్పించాలని కోరారు.