- ఐవోసీ సభ్యులతో థామస్ బాచ్ చర్చలు
లుసానే: టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేసిన తర్వాత.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) చీఫ్ థామస్ బాచ్.. తొలిసారి తమ సభ్యులతో వరుసపెట్టి చర్చలు జరిపారు. వైరస్ వ్యాప్తి, కంట్రోలు, ఒలింపిక్స్ నిర్వహణపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. భాష, టైమ్ జోన్ ప్రకారం సుమారు వంద మంది ఐవోసీ సభ్యులతో మాట్లాడారు. ‘ఒలింపిక్ సీజన్ ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరిపాం. టోక్యో ఒలింపిక్స్‌పై ఎలా ముందుకెళ్లాలి.
సన్నాహాకాలు, క్వాలిఫయింగ్ టోర్నీలపై మాట్లాడాం. వచ్చేనెల 10న ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో వీటన్నింటిపై మరోసారి చర్చిస్తాం’ అని ఐఓసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఒలింపిక్ గేమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ దుబే, ఐవోసీ స్పోర్ట్స్ డైరెక్టర్ కిట్ మెక్ కానెల్, ఐవోసీ డైరెక్టర్ జనరల్ క్రిస్టోఫర్ డి కెప్పర్, సీఈవో లానా హడాడ్ ఈ సెషన్స్‌లో పాల్గొన్నారు. ఐవోసీ మెడికల్, సైంటిఫిక్ డైరెక్టర్ రిచర్డ్ బడ్జెట్.. వాక్సిన్ అంశంపై చర్చించాడు.