Breaking News

ఒలింపిక్స్ జరగకపోతే రద్దే

ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్

టోక్యో: అనివార్య కారణాలతో వచ్చే ఏడాది ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. గేమ్స్ రద్దవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశారు. మరో ఏడాది వాయిదా వేసే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. ‘జపాన్ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. దాదాపు ఐదువేల మందితో కూడిన నిర్వాహక కమిటీని నిరంతరం నడపం చాలా కష్టం.

ప్రతి ఏడాది మిగతా క్రీడాసమాఖ్యలు కూడా షెడ్యూల్స్​​ను మార్చుకోవు. అథ్లెట్లు కూడా గందరగోళంలో పడతారు. ఎప్పుడు ఏ టోర్నీ ఉంటుందో తెలియక చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఇంతకంటే ఒలింపిక్ కోసం ఎక్కువగా ఆలోచించలేం’ అని బాచ్ పేర్కొన్నారు. అయితే జపాన్ ఒలింపిక్ కమిటీ మాత్రం గేమ్స్​ను నిర్వహించి తీరుతామని చాలా పట్టుదలతో ఉంది.