బ్రెజిల్: ఎప్పుడూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. జనం మధ్య ఉండే వారిని ఒక్కసారిగా ఐసోలేషన్ అంటూ బంధిస్తే ఉండటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సెనారో కూడా అదే ఫీల్ అవుతున్నాడంట. ఎప్పుడూ జనంలో ఉంటూ.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆయనకు ఐసోలేషన్‌లో ఉండాలంటే చిరాకుగా అనిపిస్తోంది అంట. దీంతో సోమవారం మరోసారి కరోనా టెస్టు చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నాను. మరోసారి పరీక్షలు చేయించుకుంటాను. దానికి మరికొన్ని గంటలే టైమ్ ఉంది. నేను చాలా యాంగ్జైటీతో ఎదురుచూస్తున్నాను. ఈ రకంగా ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. భయంకరంగా ఉంది. నేను బాగానే ఉన్నాను. రేపు చేసే పరీక్ష ఫలితం ఎలా వస్తుందో తెలియదు. నేను మళ్లీ నా పనులు ప్రారంభించాలి. కానీ, నా చుట్టుపక్కల వారిని కూడా పట్టించుకోవాలిగా అందుకే రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాను’ అని బోల్సెనారో అన్నారు. బోల్సనారోకి గత వారం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్‌కి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.