కరోనా రోగులు భయపడాల్సిన అవసరం లేదని.. డాక్టర్లు సూచించిన మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నయం చేసుకోవచ్చని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు హోంఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశారు. కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్కుల ధరించాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ లింగాల కమల్ రాజ్, డీఎంహెచ్వో మాలతి, ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.