Breaking News

ఐశ్వర్య అర్జున్​కు కరోనా

సీనియర్ నటుడు అర్జున్ కూతురు, నటి ఐశ్వర్య అర్జున్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఇక ఐశ్వర్య 2013లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఆమె ప్రస్తుతం హోంఐసోలేషన్​ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అందరూ తప్పని సరిగా మాస్క్‌ ధరించాలని చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు త్వరలో అందరితో పంచుకుంటానని ఆమె తెలిపారు.