Breaking News

ఐడియా సూపర్​ గురూ!

ఐడియా సూపర్​ గురూ!

తనకు నచ్చిన మంచి వీడియోలను సోషల్​ మీడియాలో షేర్​ చేస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. తాజాగా మరో వీడియోను కూడా షేర్​ చేశారు. విషయం ఏమిటంటే.. మొక్కజొన్న విత్తులను కంకుల నుంచి వేరుచేయడం కొంచెం కష్టంతో కూడినపనే. దానిని ఈజీగా చేయడానికి ఓ రైతు అద్భుతమైన ఆలోచన చేశాడు. బైక్​ను ఆన్ గేసి గేరులో ఉంచాడు. ఇప్పుడు వెనక చక్రం తిరుగుతుంటే దాని సహాయంతో బైక్ కు ఇరువైపులా ఇద్దరు కూచుని మొక్కజొన్న కంకులను వెనక చక్రానికి తగిలించడం ద్వారా కంకుల నుంచి మొక్కజొన్న విత్తుల్ని వేరుచేస్తున్నారు. 20 సెకన్లకో మొక్కజొన్న కంకి నుంచి విత్తులను వేరు చేయగలుగుతున్నారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

‘మన వ్యవసాయ విధానంలో టూవీలర్లు, ట్రాక్టర్లను బహుళ రకాలుగా వినియోగిస్తూ ఎన్నో పనులను రైతులు సులువుగా చేసుకుంటున్న వీడియోలు నాకెన్నో వస్తుంటాయి. ఈ వీడియో నేను కలలో కూడా ఊహించనిది. ఇకపై ‘కార్న్ టినెంటాల్’ అనే ప్రత్యేక బ్రాండ్‌ను కాంటినెంటల్ టైర్స్ ప్రారంభించాల్సిన సమయం వచ్చిందేమో అని చమత్కరించారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిస వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.