Breaking News

ఏ రోల్​ అయినా ఓకే

ఏ రోల్​అయినా ఓకే

మొదట హీరోగా మెప్పించాడు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా ఔరా అనిపించాడు.. ఇప్పుడు హీరోలతో విలన్​గా తలపడుతున్నాడు జగపతిబాబు. క్యారెక్టర్ ఏదైనా తనదైన స్టైల్ లో మెప్పించగలిగే సత్తా ఉంది కనుకే ఆఫర్లు వెతుక్కుంటూ వస్తుంటాయి. ఇప్పుడు లేటెస్ట్​గా నాగశౌర్య డిఫరెంట్ రోల్ లో నిర్మిస్తున్న చిత్రంలో జగపతిబాబు ఓ కీలకపాత్ర నటించనున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రాంమోహన్ రావు, శరత్ మరార్ కలిసి ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీని నిర్మిస్తున్నారు. నాగశౌర్య విలుకారుడిగా కనిపించనున్నాడు. ఆల్​రెడీ టీజ్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మంచి బజ్ వినిపించింది. నాగశౌర్య కూడా హార్డ్ వర్క్ చేస్తూ సిక్స్ ప్యాక్ బాడీ, తలపై ముడితో డిఫరెంట్ గెటప్ తో కనిపించి అభిమానుల్లో జీల్ పెంచాడు. ఈనెల 18 నుంచి నాన్ స్టాప్ షూటింగ్ మొదలవనుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.