సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఆదివారం ఉదయం నాటికి పాజిటివ్ కేసులు 1097కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వివరాలను వెల్లడించారు. బాధితులకు యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలుు చేయడంతో పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ప్రతిరోజు కేసులు పెరుగుతున్నాయి. దీంతో పరిస్థితులపై ఆందోళన కలుగుతోంది. లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయకపోతే పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఎప్పటికైనా ప్రజలంతా స్వచ్ఛందంగా సామాజిక దూరానికి సహకరించకుంటే కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉంది.
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 81 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది దీంతో మొత్తం కేసుల సంఖ్య 1097 కు చేరింది. కాగా ఇప్పటివరకు 231 మంది బాధితులకు చికిత్స చేసి డిశ్చార్జ్ చేయగా ప్రస్తుతం 835 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఇప్పటివరకు ఈ వ్యాధి బారినపడి 31 మంది మృత్యువాత గురయ్యారని పేర్కొన్నారు.