అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం(24 గంటల్లో) 10,392 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,55,531 నమోదయ్యాయి. తాజాగా, కరోనా మహమ్మారి బారినపడి 72 మంది మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,125కు చేరింది. కోవిడ్నిర్ధారణ పరీక్షలు 38లక్షలు దాటాయి. నిన్న ఒక్కరోజే 60,804 మెడికల్ టెస్టులు చేయగా, ఇప్పటివరకూ చేసిన టెస్టులు 38,43,550 చేశారు. తాజాగా కరోనా నుంచి 8,454 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధి నుంచి కోలుకుని 3,48,330 మంది ఇంటిబాటపట్టారు. రాష్ట్రంలో యాక్టివ్‌కేసులు ప్రస్తుతం 1,03,076 మేర ఉన్నాయి.
జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 810, చిత్తూరు 1,124, ఈస్ట్‌గోదావరి 1,199, గుంటూరు 900, కడప 800, కృష్ణా 397, కర్నూలు 697, నెల్లూరు 942, ప్రకాశం 800, శ్రీకాకుళం 603, విశాఖపట్నం 675, విజయనగరం 560, వెస్ట్‌గోదావరి 885 చొప్పున పాజిటివ్కేసుల నమోదు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌లో పేర్కొంది.