సారథి న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికీ 1016 పాజిటివ్ కేసులు ఉండగా 24 గంటల్లో కొత్తగా 61 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. 6,928 మంది నుండి శాంపిళ్లను సేకరించినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కర్నూలు–14, గుంటూరు–3, అనంతపురం–5, తూర్పుగోదావరి–3, కృష్ణా–25, కడప–4, నెల్లూరు–4, కొత్తగా శ్రీకాకుళం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అత్యధికంగా కర్నూలు జిల్లాలో 275, గుంటూరు జిల్లాలో 209 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా కర్నూలు, కృష్ణా జిల్లాలో ఒకొక్కరు చొప్పున మృతిచెందారు. పాజిటివ్ తో ఇప్పటి వరకు 31 మంది చనిపోగా 171 మంది రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 814 మందికి చికిత్స అందిస్తున్నారు.