అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. 24 గంటల్లో 19,085 టెస్టులు చేయగా, 553 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన వారిలో 477 మందికి పాజిటివ్ రాగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి ఏడుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రానికి చెందిన వారి కేసుల సంఖ్య 8783 కాగా.. విదేశాలకు చెందిన వారి సంఖ్య 371, ఇతర రాష్ట్రాల వారి సంఖ్య 1730కు చేరింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 10,884కు చేరింది. మృతుల సంఖ్య 136కు చేరినట్లు అధికారులు చెప్పారు. 118 మంది పేషంట్లు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,989కు చేరింది. 5,760 మంది ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,69,319 టెస్టులు చేసినట్లు అధికారులు చెప్పారు.
- June 25, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- AMARAVATHI
- CARONA
- DRAPRADESH
- అమరావతి
- ఏపీ
- కరోనా
- Comments Off on ఏపీలోనూ 10వేల కేసులు