సారథి న్యూస్, వాజేడు: ఏటూరు నాగారం టైగర్‌జోన్ ను నిలిపివేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం నాగరాజు అన్నారు. ఆదివారం ఆదివాసీ నవనిర్మాణ సేన ముఖ్యకార్యకర్తల సమావేశం ములుగు జిల్లా అధ్యక్షుడు యెట్టి విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో అనేక ఆదివాసీ గ్రామాలు ఉన్నాయని, టైగర్ జోన్ ను ఏర్పాటుచేస్తే ఆదివాసీలు నిర్వాసితులు అవుతారని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో, టైగర్ జోన్ల పేరుతో, ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరుతో ఆదివాసీలను అంతమొందించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. జల్ జంగిల్ జమీన్ కోసం మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు యెట్టి విద్యాసాగర్, బోదెబోయిన శ్రీనాథ్, మడకం రవి, సురేష్, మోడెం జనార్ధన్, గొంది సత్యనారాయణ, కారం, నాగేశ్వరరావు, సతీష్, ప్రశాంత్, రవి, కృష్ణయ్య పాల్గొన్నారు.
- November 1, 2020
- Archive
- Top News
- వరంగల్
- ADICASI
- ETURNAGARAM
- OPENCOAST
- TIGER
- ఆదివాసీ
- ఏటూరు నాగారం
- ఓపెన్ కాస్ట్ మైనింగ్
- టైగర్‌జోన్
- నవనిర్మాణ సేన
- Comments Off on ఏటూర్ నాగారం టైగర్ జోన్ వద్దు