చెన్నై: షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీపై కామెంట్స్ చేసిన కేసులో డీఎంకే రాజ్యసభ మెంబర్ ఆర్‌ఎస్ భారతిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చెన్నైలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. సిటీ కోర్టులో హాజరుపరచగా జులై 1 వరకు కోర్టు ఇంటరిమ్ బెయిల్ మంజూరు చేయడంతో ఆయనను రిలీజ్ చేసినట్లు చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం చేసిన అవినీతిని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నందునే అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారని భారతీ ఆరోపించారు.
ఫిబ్రవరిలో డీఎంకే పార్టీ మీటింగ్‌లో మాట్లాడిన మాటలను వక్రీకరించి, ఫేక్ వీడియో తయారుచేశారని అన్నారు. కాగా..డీఎంకేకు చెందిన ఇంకో లీడర్, లోక్‌సభ ఎంపీ దయానిధి మారన్ మద్రాస్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన కొంతమందిపై కామెంట్స్ చేశారని ఆయనపై కేసు పెట్టడంతో బెయిల్ కోసం పిటిషన్ వేసినట్లు ఆయన తరఫు లాయర్ అన్నారు.