సారథి న్యూస్, కర్నూలు: ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ద్వారా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన సచివాలయ ఉద్యోగుల ఉచిత ఆన్లైన్ గ్రాండ్టెస్ట్–3 ప్రశ్నపత్రాన్ని ఎస్పీ కె.ఫక్కీరప్ప శుక్రవారం తన కార్యాలయంలో ప్రారంభించారు. కరోనా వంటి క్లిష్టపరిస్థితుల్లో ఎస్ వీ మోహన్ రెడ్డి ఉచితంగా కోచింగ్ ఇప్పించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో తీవ్రమైన పోటీఉందని నిషితమైన విశ్లేషణలతో కూడిన చదువులు అవసరమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎస్ వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాము ఇప్పటికి మూడు గ్రాండ్ టెస్టులు నిర్వహించామని, తపన, కృషి ఉంటే ఏదైనా సాధించగలరని అన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ శివకిశోర్, కోఆర్డినేటర్ వైవీ శివయ్య, షరీఫ్, శ్రీను, మధు, భాష, బాబు పరశురాం పాల్గొన్నారు.
- September 18, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- FREE COACHING
- Kurnool
- SECRETARIAT EXAM
- SV SUBBAREDDY
- ఎస్వీ సుబ్బారెడ్డి
- కరోనా
- ఫ్రీకోచింగ్
- సచివాలయ పరీక్ష
- Comments Off on ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఫ్రీ కోచింగ్