మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోబోయే వరుడి గురించి కొంతకాలంగా సోషల్మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే మెగా డాటర్ నిహారిక కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ అనే విషయం క్లారిటీ కూడా వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో నిహారిక పెళ్లి విషయమై అభిమానులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తాజాగా గూగుల్ లో చైతన్య జొన్నలగడ్డ గురించి సెర్చ్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. మొన్నటి వరకు 1700 ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న చైతన్య కొన్ని గంటల వ్యవధిలో ఏకంగా 50 వేల ఫాలోవర్స్ కు చేరువ అయ్యాడట. నిహారిక పక్కన చైతన్య కనిపించిన వెంటనే ఆయన గురించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పాటు సోషల్ మీడియాలో చైతన్య గురించి వెదకడం ప్రారంభం అయ్యింది.
ప్రముఖ స్టార్స్ కు మాత్రమే దక్కే సెలబ్రెటీ హోదా అప్పుడే చైతన్యకు దక్కింది. మెగా ఫ్యామిలీకి కాబోతున్న అల్లుడు అవ్వడంతో చైతన్య గురించి నెట్టింట జనాలు తెగ వెదికేస్తున్నారు. చైతన్య ఏం చేస్తాడు.. అసలు ఎవరీ చైతన్య అంటూ..? ఎవరి కొడుకు.. ఏం చదువుకున్నాడు.. హీరోగా చేయాలనే ఆసక్తి ఉందా అనే విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ తాపత్రయ పడుతున్నారు. ఇప్పుడు వేలల్లో జొన్నలగడ్డ చైతన్య గురించి ఆర్టికల్స్ ఫొటోలు విశేషాలు వస్తున్నాయి. గూగుల్ లో గత మూడు నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సెర్చ్ కాబడ్డ కీ వర్డ్స్ లో జొన్నలగడ్డ చైతన్య టాప్ లో ఉందని సమాచారం. మొత్తానికి నిహారికను పెళ్లి చేసుకోక ముందే చైతన్య స్టార్ సెలబ్రెటీ హోదాను దక్కించుకున్నాడు. ఇదే జోరుతో చైతన్య హీరోగా కూడా పరిచయం అవుతాడేమో అని అంతా అనుకుంటున్నారు కూడ