Breaking News

ఎన్​వోసీకి రూ.1.12 కోట్ల లంచం

లంచం రూ.1.12కోట్లు

  • మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
  • ఆయన ఆస్తులపై విచారణ మొదలుపెట్టిన అధికారులు

సారథి న్యూస్​, మెదక్: భూవివాదంలో పరిష్కారానికి రూ.1.12 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై మొదక్ పట్టణంలోని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లోని ఇతర ఆస్తులపై కూడా విచారణ మొదలైంది. ఏసీబీ సోదాల్లో సీఐలు ఫయాజ్, గంగాధర్, ఎస్సైలు మజీద్ అలీ ఖాన్, నాగేంద్రబాబు, రామలింగారెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. అయితే నర్సాపూర్ మండలం చిప్ప ల్ తుర్తిలో 112 ఎకరాలకు ఎన్ వోసీ జారీచేసేందుకు ఎకరాకు లక్ష చొప్పున రూ.1.12 కోట్లు డిమాండ్​ చేశారని రైతు మూర్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. మాచవరం లో అడిషనల్ కలెక్టర్ నగేష్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. నగేష్‌తో పాటు ఆర్డీవో అరుణ, నరసాపూర్ తహసీల్దార్ మాలతి, వీఆర్ఏ, వీఆర్ఓలతో కలిపి 12 మంది ఇళ్లల్లో ఏకాకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లో 20 లక్షలు బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగేష్‌ భార్యను కొంపల్లిలోని తన నివాసానికి తరలించారు. ఏసీబీ అధికారులు మరికొద్ది సేపట్లో అడిషనల్​ కలెక్టర్​ నగేష్ బ్యాంక్ లాకర్‌ను ఓపెన్ చేయనున్నట్టు తెలుస్తోంది.

నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు