రాజమౌళి ఈగ కాదు.. మానవపాడులో వెదురుకర్రపై వాలిన ఈగ కృష్ణానది బ్యాక్‌వాటర్ సోమశిలలో చెలిమె నీటిని తవ్వుతున్న బాలుడు వానరం వెకిలి చేష్టలు.. మానవపాడులో నేను బాగున్నానా.. బైక్ అద్దంలో చూసుకున్న పిచుక.. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో శ్రమైక్య జీవన సౌందర్యం.. కల్వకుర్తి మండలం తుర్కలపల్లిలో ఉపాధి హామీలో తట్టమోస్తున్న ఓ వృద్దురాలు మెదక్ జిల్లా కొల్చారం ఆనకట్ట పరిసరాల అందాలు ఫారెన్ కాదు.. పాలమూరులోనే.. ఆకట్టుకుంటున్న కందిచేను సాళ్లు.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ శివారులో చీమల్లా భక్తలు.. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లొద్దిమల్లయ్య జాతరలో భక్తజనసందోహం కృష్ణమ్మ చెంతన వేంకటేశ్వరుడు.. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం కృష్ణానది తీరాన వెంకటేశ్వర ఆలయం కాన్వాస్‌పై పెయింటింగ్.. నాగర్‌కర్నూలు జిల్లా ఎల్లూరు రిజర్వాయర్ పరిసర అందాలు నింగినేల ఏకమై.. ఆకాశాన్ని తాకినట్టు కనిపిస్తున్న నల్లరేగడి పొలం. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు సమీపంలో భూమికి పచ్చాని రంగేసినట్టు.. కేఎల్ఐ ఆయకట్టు
ప్ర కృతి మనకు ఎంతో ఇచ్చింది..
ప్రతీది అపురూపంగానే కనిపిస్తోంది..
ప్రతి దృశ్యం ఆహ్లాదం కలిగిస్తుంది..
తియ్యటి జ్ఞాపకాలు..
మరిచిపోలేని అనుభూతులు..
మధుర ఘట్టాలు..
గొప్ప సన్నివేశాలు..
వెలకట్టలేని దృశ్యాలను పదికాలాల పాటు మన కళ్లముందు పదిలంగా ఉంచేదే ఫొటో. ఫొటోగ్రఫీ అనేది సృజనాత్మక కళ. వంద మాటల్లో చెప్పలేనిది ఒక్కఫొటోతో చెప్పొచ్చు. మనసు దోచే రమణీయ దృశ్యాలు.. ఆలోచింపజేసే రూపాల సమాహారమే ఫొటోగ్రఫీ. ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆకట్టుకునే చిత్రాలు కొన్ని మీ కోసం..
ఫొటోలు ఎండీ సాధిక్, ఏ.సుధాకర్
Like this: Like Loading...
Related