సారథి న్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ భవనం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆదివారం మొక్క నాటి నీళ్లు పోశారు. ఊరూరా హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్, కెఎస్ఎన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ వెంకన్న, బానోత్ రవినాయక్ పాల్గొన్నారు.
- July 19, 2020
- Top News
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- MAHABUBABAD
- SHANKARNAIK
- TRS
- టీఆర్ఎస్
- మహబూబాబాద్
- శంకర్‌నాయక్
- హరితం
- Comments Off on ఊరూరా మొక్కలు నాటాలె