Breaking News

ఊరురా జెండా పండుగ

ఊరూరా జెండా పండుగ

సారథి న్యూస్​, నెట్​వర్క్​: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కేవలం కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పరిమిత సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే వేడుకలకు హాజరయ్యారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో స్వేరోస్​ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్నినారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనరేట్​లో కమిషనర్​ వి.సత్యనారాయణ జెండాను ఎగురవేశారు.

కరీంనగర్​ జిల్లా రామడుగు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పంజాల ప్రమీల, ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కల్గెటి కవిత, తహసీల్దార్​ చింతల కోమల్ రెడ్డి, ఏవో యాస్మిన్, ఎస్సై అనూష పతాకావిష్కరణ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్​, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు జెండా ఎగరవేశారు.

మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఎస్సై గౌస్​, తహసీల్దార్​ రాజేశ్వర్​రావు, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మిరెడ్డి, ఎంపీడీవో లక్ష్మణమూర్తి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సెర్ప్ ఆఫీస్ ముందర మండల సమాఖ్య అధ్యక్షురాలు పావని, మోడల్ స్కూల్ లో ప్రిన్సిపల్ శ్రీదేవి, కేజీబీవీ స్కూల్లో ఎస్వో గీత, పీహెచ్​సీ సెంటర్ లో డాక్టర్ శ్రావణి, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాజిరెడ్డి, లైబ్రరీ ముందర లైబ్రేరియన్ గణేశ్​, స్థానిక జెడ్పీహెచ్​ఎస్​ పాఠశాలలో హెచ్ఎం రమ, ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు.

అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే అబ్రహాం పతాకావిష్కరణ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో ప్రభుత్వ విప్​ ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డి జెండాను ఎగురవేశారు. జోగులాంబ గద్వాల జెడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సరిత పతాకావిష్కరణ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలో ఎస్సై గురుస్వామి, ఎంపీడీవో రమణరావు, తహసీల్దార్​ వరలక్ష్మి, సర్పంచ్ హేమావతి దామోదర్ రెడ్డి, ప్రాథమిక ఆస్పత్రిలో వైద్యురాలు దివ్య, ఎంఈవో శివప్రసాద్, సర్పంచ్ ఆత్మాలింగారెడ్డి గోకులపాడులో సర్పంచ్ నర్సింహులు మువ్వేవెన్నల జాతీయ జెండాను ఎగురవేశారు.

మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని ఎంపీపీ సిద్ధరాములు, వ్యవసాయాధికారి సతీశ్, ఎస్సై ప్రకాశ్​గౌడ్, తహసీల్దార్​ జయరాం జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియ నాయక్​, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎస్పీ సునీల్ దత్, ఆడిషినల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అలాగే అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బుక్కాపురం లక్ష్మన్న, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాందేవ్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పటేల్ విష్ణు వర్ధన్ రెడ్డి, మాజీ టెంపుల్ చైర్మన్ నారాయణ రెడ్డి, ఉండవెల్లి టీఆర్​ఎస్​ యువనేత తేజ, రామగుండం కమిషనరేట్​ పరిధిలోని డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, ఏఆర్ అడ్మిన్ డీసీపీ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

పంద్రాగస్టు వేడుకల్లో గద్వాల జడ్పీ చైర్మన్ సరిత, కార్పొరేషన్​ చైర్మన్​ గట్టు తిమ్మప్ప, జిల్లా రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, బీఎస్​ కేశవ్​, ఇటిక్యాల జడ్పీటీసీ హనుమంత్ రెడ్డి, వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశపోగు రాజు, టీఆర్​ఎస్​ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, మల్లెందొడ్డి మద్దిలేటి, జెడ్పీసీఈవో ముసాయిదా బేగం, స్వేరోస్​ సభ్యులు జెట్టిపల్లి అనిల్, జెట్టిపల్లి విజయ్, నాగి జయంత్, ఎంపీటీసీ రాధిక, ఉపసర్పంచ్​ జీవన్, మాజీ సర్పంచ్​ కుమార్​గౌడ్​, మాజీ డీసీఎంఎస్​ డైరెక్టర్​ ఆవుల గోపాల్​రెడ్డి, ఎంపీవో గిరిధర్​రెడ్డి, ఏపీవో వెంకటసాయి పాల్గొన్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లా బొంకూర్ గ్రామంలో జెండావిష్కరణ
మెదక్​ జిల్లా కౌడిపల్లిలో..
మెదక్​ జిల్లా నిజాంపేట మండలం అగ్రికల్చర్​ ఆఫీసు ఎదుట
జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్​ ఆఫీసులో
జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో..
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహాంకు మంత్రి కేటీఆర్​ చిత్రపటం బహూకరణ
మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో..