సారథి న్యూస్, వాజేడు: ఒక్కసారిగా ఊరంతా దుర్వాసన లేచింది. కరోనా నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఊరులో ఏం జరిగిందని ఆరాతీయడం మొదలుపెట్టారు. తీరా విషయం ఏమిటంటే.. ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు పంచాయతీ ఆఫీసు పక్కన ఉన్న చింతచెట్టు కొమ్మలను పదిరోజుల క్రితం పంచాయతీ సిబ్బంది నరికివేశారు. కొమ్మలపై కొంగ గుడ్లు, పిల్లలు పదులసంఖ్యలో ఉన్నాయి. చెట్లు నరికిన సమయంలో అవి కింద 50 పిల్లల మేర చనిపోయాయి. అంతేకాదు గుడ్లన్నీ పగిలిపోయాయి. వాటిని రోడ్డుపై వేయడంతో కళేబరాలు కుళ్లిపోయి ఊరంతా దుర్వాసన అలుముకుంది. వాసనకు కొత్త రోగాలకు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు కలవరపాటుకు గురయ్యారు.
- August 16, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- CRANEEGGS DESTROYED
- MULUGU
- PUSURU
- VAJEDU
- పూసూరు
- ములుగు
- వాజేడు
- Comments Off on ఊరంతా దుర్వాసన.. ఎందుకంటే!